తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ 2020 నోటిఫికేషన్ విడుదలవుతుంది
- FUTURE GURU
- Feb 18, 2020
- 1 min read
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ శనివారం సాయంత్రం జారీ అయ్యింది. దీనికి సంబందించి ఈనెల 19న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈనెల 21 నుంచి మార్చి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 4,5,7 తేదీలలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు, మే 9,11 తేదీలలో ఎంసెట్ వ్యవయసాయ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలు:
మార్చి 30 తరువాత నుంచి ఏప్రిల్ 6వరకు రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు రూ.1,000తో, దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు రూ.5,000, ఏప్రిల్ 21 నుంచి 27 వరకు రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆలస్యం అవుతున్నకొద్ది ఆలస్య రుసుము భారీగా పెరిగిపోతుంది కనుక ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు మార్చి 30 గడువులోగా దరఖాస్తులు సమర్పించడం మంచిది.

Comments